Skip to main content

కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలు

Last updated: 12th May 2022

ఈ కంటెంట్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ("గైడ్ లైన్స్") https://www.mxtakatak.com/ మరియు Takatak మొబైల్ అప్లికేషన్‌లో ఉన్న మా వెబ్‌సైట్‌ను దాని లైట్ వెర్షన్‌లతో సహా (సమష్టిగా, "ప్లాట్‌ఫామ్") అందించినది [మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్] ("టకాటక్", "కంపెనీ", "మేము", "మా" మరియు "మా"). "మీరు" మరియు "మీ" అనే పదాలు ప్లాట్‌ఫామ్ యొక్క వినియోగదారుని సూచిస్తాయి.

ఈ మార్గదర్శకాలు Takatak వినియోగ నిబంధనలు మరియు TakaTak ప్రైవసీ పాలసీలు (సమష్టిగా, "నిబంధనలు") పేర్కనబడ్డాయి. ఈ మార్గదర్శకాలలో ఉపయోగించిన క్యాపిటలైజ్డ్ పదాలు నిబంధనలలో అటువంటి పదాలకు ఇచ్చిన అర్థాన్ని కలిగి ఉంటాయి.

మేము ఈ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు మార్చవచ్చు, అలా చేయడానికి మాకు హక్కులు ఉన్నాాయి అని గమనించండి.

మా ప్లాట్‌ఫామ్ మిమ్మల్ని భారతదేశం అంతటా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వ్యక్తులతో కలుపుతుంది. మేము క్రియేట్ చేసిన కమ్యూనిటీ వైవిధ్యమైనది మరియు విభిన్న కంటెంట్‌ను స్వీకరించేదిగా ఉంటుంది, అయితే ప్లాట్‌ఫామ్‌ను విభిన్న యూజర్లు యాక్సెస్ చేస్తారు. ఇందులో మైనర్‌లు మరియు యుక్తవయసు వారు కూడా ఉండవచ్చు. అందువల్ల, మా వినియోగదారులందరూ నిబంధనలను అనుసరిస్తున్నట్లు నిర్ధారించుకోవడానికి, మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటానికి మేము ప్లాట్‌ఫామ్ వినియోగాన్ని నియంత్రించే మార్గదర్శకాలు మరియు పరిమితులు ఉంచాము.

కంటెంట్ గైడ్ లైన్స్

మా ప్లాట్‌ఫామ్‌లో అనుమతి లేని మరియు మా గైడ్ లైన్స్​ను ఉల్లంఘించే కంటెంట్‌ను మేము తొలగిస్తాము. అటువంటి కంటెంట్ మా దృష్టికి వస్తే, మేము దానిని తీసివేయవచ్చు మరియు ఆ వినియోగదారు ఖాతాలను బ్యాన్ కూడా చేయవచ్చు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్ మీకు కనిపిస్తే, దానిని మాకు రిపోర్ట్ చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. క్రియేటర్ యొక్క ఉద్దేశ్యం, సృజనాత్మక స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకుంటాము. అయినప్పటికీ అసౌకర్యాన్ని కలిగించే, ద్వేషపూరిత ప్రసంగం, దుర్వినియోగంగా పరిగణించబడే వాటిని వ్యాప్తి చేయడం, హింస, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించే లేదా ప్లాట్‌ఫామ్‌లోని వినియోగదారుడి, క్రియేటర్​కి ఆటంకం కలిగించే కంటెంట్‌ను మేము ఎట్టిపరిస్థితుల్లోనూ స్వాగతించము.

a. చట్టాలకు కట్టుబడి ఉండటం

పరిమితి లేకుండా, అప్‌లోడ్ చేయబడిన, పోస్ట్ చేసిన, వ్యాఖ్యానించిన లేదా మా ప్లాట్‌ఫామ్‌లో మీరు షేర్ చేసిన కంటెంట్‌తో సహా మొత్తం కంటెంట్, భారతీయ పీనల్ కోడ్ 1860 మరియు 2000 సాంకేతిక చట్టాల లో వున్న అన్ని నియమాలు సహా భారతదేశ చట్టాలకు కట్టుబడి ఉండాలి. సవరణలతో పాటు మేము చట్టపరమైన అధికారులతో సహకరిస్తాము మరియు చట్టాలను ఉల్లంఘించిన సందర్భాల్లో స్టాండర్డ్ విధానాలను అమలు పరుస్తాము.

భారతదేశ ఐక్యత, సమగ్రత, రక్షణ, భద్రత లేదా సార్వభౌమత్వం, విదేశాలు లేదా పబ్లిక్ ఆర్డర్‌తో స్నేహపూర్వక సంబంధాలకు ముప్పు కలిగించే కంటెంట్ అప్‌లోడ్ చేయబడదు. పోస్ట్ చేయబడదు. షేర్​ చేయబడదు. మీరు ఏ ఇతర దేశాన్ని అవమానించే, ఏదైనా నేరాలను ప్రేరేపించే, నేరాల విచారణను నిరోధించే కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదు.

B.నగ్నత్వం, అశ్లీలత

అత్యంత పరిమిత లైంగిక చిత్రాలను కలిగి ఉండే కంటెంట్‌ను మా ప్లాట్​ఫామ్​లో పోస్ట్ చేసేందుకు లేదా షేర్ చేసేందుకు అంగీకరిస్తాము. అయితే ఆ కంటెంట్.. ఏదైతే కళాత్మక మరియు విద్యా ప్రయోజనాల కోసం గానీ ప్రజల అవగాహన కోసం గానీ హాస్యం వంటి వాటికోసం పోస్ట్ చేయబడితే అంగీకరిస్తాము అనేది గుర్తుంచుకోవాలి. ఈ కింది పేర్కొన్న అంశాలు కలిగి ఉన్న కంటెంట్​ పోస్ట్ చేయడ నిషేధిం మరియు మార్గదర్శకాల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుంది;

 • అశ్లీల, అసభ్యకరమైన లైంగిక, నగ్నత్వం లేదా వ్యక్తిగత భాగాలను (లైంగిక అవయవాలు, ఆడవారి రొమ్ములు మరియు చనుమొనలు, పిరుదులు) లేదా లైంగిక కార్యకలాపాలను చిత్రీకరించే చిత్రాలు/వీడియోలు;
 • కాంప్రమైసింగ్ సిట్యుయేషన్ లో ఉన్న వ్యక్తుల వీడియోలు లేదా చిత్రాలు లేదా లైంగిక చర్యలు లేదా శృంగార ఉద్దేశం లేదా లైంగిక ప్రేరేపణను చిత్రీకరించే కంటెంట్;
 • సెక్స్టార్షన్ లేదా రివెంజ్ పోర్నోగ్రఫీ;
 • మృగత్వం లేదా జూఫిలియా;
 • ఏదైనా వ్యక్తిని దోపిడీ చేసే లేదా అపాయం కలిగించే కంటెంట్ (ఉదాహరణకు, ఫోన్ నంబర్‌ల జాబితా, లేదా వ్యభిచారం లేదా ఎస్కార్ట్ సేవలను ప్రోత్సహించడం లేదా అభ్యర్థించడం వంటి ప్రయోజనాలతో సహా ఒక వ్యక్తి యొక్క ఏదైనా దోపిడీ లేదా ప్రమాదాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇతర వ్యక్తిగత సమాచారం);
 • పిల్లల అశ్లీలతకు సంబంధించిన కంటెంట్ (పరిమితి లేకుండా, సృష్టి, ప్రమోషన్, గ్లోరిఫికేషన్, ట్రాన్స్‌మిషన్ లేదా చైల్డ్ పోర్నోగ్రఫీ బ్రౌజింగ్);
 • అసభ్యకరమైన, అనైతిక లేదా అత్యాచారం, లైంగిక అభ్యంతరం, ఏకాభిప్రాయం లేని కార్యకలాపాలు మరియు వేధింపులకు సంబంధించిన కంటెంట్.

c. వేధింపులు లేదా బెదిరింపు

మేము మా ప్లాట్‌ఫామ్‌లో వేధింపులు లేదా బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నాము. మా వినియోగదారులకు భావోద్వేగ లేదా మానసిక క్షోభకు భయపడకుండా తమ భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛను అందించాలని మేము భావిస్తున్నాము. మీరు బాధించేదిగా భావించే ఏదైనా కంటెంట్‌ను పట్టించుకోవద్దని మేము మిమ్మల్ని కోరుతున్నాము. దీనితో పాటుగా, మరొక వ్యక్తిని వేధించే లేదా ఏ వ్యక్తినైనా కించపరిచే లేదా అవమానపరిచే ఉద్దేశంతో కంటెంట్‌ను రిపోర్ట్ చేయమని కూడా మేము మిమ్మల్ని కోరుతున్నాము.

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు అర్హత పొందిన కంటెంట్ వీటిని కలిగి ఉంటుంది, కానీ వీటికే పరిమితం కాదు:

 • దుర్భాష లేదా శాప పదాలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు లేదా హానికరమైన రికార్డింగ్‌లను పోస్ట్ చేయడం.
 • ఈ ప్లాట్‌ఫామ్‌లో జాతి, కుల, మత, లింగ, రంగు, వైకల్యాలు, లైంగిక ప్రాధాన్యతలు లేదా లైంగిక దుష్ప్రవర్తనలో పాల్గొనడం ఆధారంగా ఎవరైనా అభ్యంతరం చెప్పడం, అవమానించడం లేదా వేధించడం అనుమతించబడదు. అదేవిధంగా, పైన పేర్కొన్న కంటెంట్ ఆధారంగా లేదా ఏ వ్యక్తినైనా బ్లాక్ మెయిల్ చేయడం నిషేధం..
 • ఎవరైనా మిమ్మల్ని వారి ఖాతా నుండి బ్లాక్ చేస్తే, దయచేసి వేరే ఖాతా నుండి వారిని సంప్రదించడానికి ప్రయత్నించవద్దు. ఒక వినియోగదారు ప్లాట్‌ఫామ్‌లో మీతో ఎంగేజ్ అవ్వకూడదనుకుంటే, వారి నిర్ణయాన్ని గౌరవించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము.
 • ఒక వ్యక్తిని వేధించే, బాధ కలిగించే లేదా అపాయం కలిగించే ఉద్దేశ్యంతో వారి సమ్మతి లేకుండా షేర్ చేయబడిన ఏదైనా చిత్రం లేదా సమాచారం.
 • ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవరినైనా వేధించడానికి లేదా వారికి ఏదైనా హాని చేయడానికి తప్పుడు సమాచారం పోస్ట్ చేయటం.

ఏదేమైనప్పటికీ, వార్తలలో ప్రదర్శించబడిన లేదా ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తుల (సెలెబ్రెటీస్, పబ్లిక్ ఫిగర్స్​) గురించి క్లిష్టమైన చర్చలు జరిగినట్లయితే, మేము నిబంధనలు మరియు ఈ మార్గదర్శకాలకు లోబడి దానిని అనుమతించేందుకు వీలుంది.

d. మేధో సంపత్తి

మేము మేధో సంపత్తి హక్కులను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము మరియు అటువంటి హక్కుల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తాము. సాహిత్య, సంగీత, నాటకీయ, కళాత్మక, సౌండ్ రికార్డింగ్‌లు, సినిమాటోగ్రాఫిక్ వర్క్‌లు వంటి మొత్తం కంటెంట్ మేధో సంపత్తి రక్షణకు లోబడి ఉంటుంది.

ప్లాట్‌ఫామ్‌లో మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్న వ్యక్తి/సంస్థ నుండి కాపీ చేయబడిన కంటెంట్‌ను పోస్ట్ చేయడం అనుమతించబడదు. థర్డ్ పార్టీ మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్ తొలగించబడుతుంది. రిపీటెడ్​గా డిఫాల్టర్‌లుగా ఉన్న వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. మీరు ప్లాట్‌ఫామ్‌లో నుండి అటువంటి కంటెంట్‌ను తిరిగి షేర్ చేయాలనుకుంటే, దయచేసి కంటెంట్ యొక్క ప్రామాణికమైన మూలాన్ని తెలిపే ఎటువంటి అట్రిబ్యూషన్‌లు, వాటర్‌మార్క్‌లు మరియు అసలు శీర్షికలను తీసివేయవద్దు. అలా చేయాలి అనుకుంటే దయచేసి అవసరమైన అనుమతులను తీసుకోండి మరియు వారి పేరు మరియు / లేదా అసలు మూలాన్ని పేర్కొనడం ద్వారా అటువంటి కంటెంట్‌లో మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్న మీ తోటి వినియోగదారులు లేదా ఏదైనా ఇతర సంస్థ/వ్యక్తికి తగిన క్రెడిట్స్​ అందించండి.

e. హింస

మా వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగించే హింస మరియు బాధలను ప్రేరేపించే గ్రాఫికల్ చిత్రాలు లేదా వీడియోలు, శారీరక హింస లేదా జంతు హింసను ప్రేరేపించే కంటెంట్‌ ఏదైనా హింస గా పరిగణించబడుతుంది. ప్రమాదకరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించే కంటెంట్, లేదా ఉగ్రవాదం, వ్యవస్థీకృత హింస లేదా నేర కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు, సమూహాలు లేదా నాయకులను ప్రశంసించడం నిషేదం.

ప్లాట్‌ఫామ్‌లో హింసకు సంబంధించిన విద్యాపరమైన సమాచారo తో కూడిన కంటెంట్ అనుమతించబడవచ్చు. కల్పిత సెటప్, మార్షల్ ఆర్ట్స్ రూపంలో హింసాత్మక కంటెంట్ ఈ ప్లాట్‌ఫామ్‌లోని మార్గదర్శకాలకు లోబడి ఉంటే అనుమతించబడవచ్చు.

f. ద్వేషపూరిత ప్రసంగం మరియు ప్రచారం

ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంపై హింసాత్మక ప్రవర్తనను ప్రోత్సహించే కంటెంట్, ఏదైనా నిర్దిష్ట మతం, జాతి, కులం, సంఘం, జాతీయత, వైకల్యం (శారీరక లేదా మానసిక), వ్యాధులు లేదా లింగాన్ని భయపెట్టడం, లక్ష్యంగా చేసుకోవడం లేదా కించపరచడం వంటివి నిషేధించబడ్డాయి. మతం, కులం, జాతి, సంఘం, లైంగిక ధోరణి లేదా లింగ గుర్తింపు వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా ద్వేషాన్ని ఉత్పత్తి చేసే లేదా ద్వేషపూరిత ప్రచారాన్ని సృష్టించే లేదా వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో ఏదైనా కంటెంట్ అనుమతించబడదు. మేము వివక్షను వ్యాప్తి చేసే కంటెంట్‌ను అలరించము, పైన పేర్కొన్న లక్షణాల ఆధారంగా హింసను సమర్ధించము మరియు ఏ కోణంలోనైనా లేదా ప్రతికూల అర్థాలతో ఒక వ్యక్తిని లేదా వ్యక్తుల సమూహాన్ని తక్కువ స్థాయికి చెందిన వారిగా సూచించము.

మా వినియోగదారులకు ఆగ్రహాన్ని కలిగించే మరియు వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసే వ్యాఖ్యానాలు మరియు ప్రచురణ సిద్ధాంతాలు లేదా ద్వేషపూరిత భావజాలాలకు దూరంగా ఉండాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ప్లాట్‌ఫామ్‌లో ఈ సమస్యలపై అవగాహన పెంచడానికి లేదా సవాలు చేయడానికి ఉద్దేశించిన కంటెంట్‌ను మేము అనుమతించవచ్చు.

g. మ్యూజిక్ లైబ్రరీ ఉపయోగం

Takatak లో మీరు ఉపయోగించడానికి విస్తృతమైన మ్యూజిక్ లైబ్రరీ అందుబాటులో ఉంది. ప్లాట్‌ఫామ్‌లో మీ సృజనాత్మకత మరియు ప్రతిభను ప్రదర్శించడానికి కంటెంట్‌ని సృష్టించడానికి మీరు ఈ సంగీతాన్ని ఉపయోగించవచ్చు. అయితే, లైబ్రరీలో సంగీతం యొక్క ఉపయోగం నిర్దిష్ట నిబంధనలకు పరిమితం చేయబడిందని దయచేసి గమనించండి. ఉదా:

 • మీరు పొందుపరచగల సంగీతం యొక్క పొడవు మారుతూ ఉంటుంది కానీ ఏ సందర్భంలోనైనా 60 సెకన్ల కంటే మించకూడదు;
 • మీరు ఉపయోగించే మ్యూజిక్ తప్పనిసరిగా వాణిజ్యేతర స్వభావం కలిగి ఉండాలి;
 • దయచేసి ఎవరినీ కించపరచటం లేదా కమ్యూనిటీ మార్గదర్శకాలు లేదా ఏదైనా ఇతర నిబంధనలను ఉల్లంఘించి ఆడియో ను ఉపయోగించవద్దు.

మీ కంటెంట్‌లోని ఆడియో మా నిబంధనలు మరియు చట్టాలకి విరుద్ధంగా ఉన్నట్లయితే మీ కంటెంట్ ను నిలిపివేయడానికి, కంటెంట్‌ను తీసివేయడానికి లేదా దాని భాగస్వామ్యం/యాక్సెస్‌ని పరిమితం చేసే హక్కు మాకు ఉంది. మా లైబ్రరీలో అందుబాటులో ఉన్న మ్యూజిక్ నిరంతరం మారుతూ ఉంటుంది మరియు ఈ రోజు మా లైబ్రరీలో అందుబాటులో ఉన్న మ్యూజిక్ భవిష్యత్తులో అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటి చర్యల కారణంగా (ఆడియో కోల్పోవడం, ఆడియో ని నిలిపివేయడం, ఉపసంహరించుకోవడం మొదలైనవి) మీరు ఎలాంటి నష్టానికి లేదా హానికి మేము బాధ్యత వహించము.

మేము మా మ్యూజిక్ లైబ్రరీ లో లేని సంగీతాన్ని వేరే పరికరంలో చేసిన వీడియోలను అప్‌లోడ్ చేయటానికి వినియోగదారులను అనుమతిస్తాము. వీడియోలోని సంగీతం థర్డ్ పార్టీ యొక్క కాపీరైట్‌ను ఉల్లంఘించిన సందర్భంలో మరియు ఇది మా దృష్టికి తీసుకురాబడినట్లయితే, మేము వీడియోను తీసివేయవచ్చు.

h. నిందించటం, స్వీయ హాని లేదా ఆత్మహత్య

మేము ఆత్మహత్య లేదా అలాంటి ధోరణులను ప్రదర్శించే కంటెంట్‌ను మా ప్లాట్​ఫామ్​లో అనుమతించము, స్వీయ గాయం మరియు హానిని ప్రేరేపించడం లేదా ప్రమాదకరమైన కార్యకలాపాలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం. శారీరక, మానసిక, లైంగిక లేదా మానసిక వేధింపులకు సంబంధించిన ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేయడం, ఏదైనా వ్యక్తిని నిర్లక్ష్యం చేయడం లేదా దుర్వినియోగం చేయడం, అది పిల్లలు లేదా పెద్దలది కావచ్చు, అది ఖచ్చితంగా ఖండించబడుతుంది. స్వీయ-హానిని ప్రదర్శించే కంటెంట్, స్వీయ గాయం లేదా ఆత్మహత్యను కీర్తించడం లేదా ఏదైనా పద్ధతిలో స్వీయ-హాని ఎలా చేసుకోవాలో సూచనలను కూడా పేర్కొనడం అనుమతించబడదు. ఇంకా, మానసిక/శారీరక దుర్వినియోగం, స్వీయ గాయం లేదా గృహహింస లేదా మరేదైనా హింసకు గురైన బాధితులు మరియు ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడం, ట్యాగ్ చేయడం, దాడులు చేయడం మరియు ప్రతికూలంగా లక్ష్యంగా చేసుకునే లేదా ఎగతాళి చేసే కంటెంట్ నిషేధించబడింది.

అటువంటి తీవ్రమైన సమస్యలకు గురవుతున్న వారికి మద్దతు, సహాయం మరియు రికవరీకి అందించడానికి ఉద్దేశించిన కంటెంట్‌ను మేము అనుమతిస్తాము. మేము వినియోగదారులు వారి అనుభవాలను పంచుకోవడానికి కూడా అనుమతిస్తాము, అటువంటి కంటెంట్‌ను పోస్ట్ చేయాలనే ఉద్దేశ్యానికి లోబడి సహాయం అవసరమైన వారికి కోపింగ్ మెకానిజమ్‌లను అందించవచ్చు.

i. చట్టవిరుద్ధ కార్యకలాపాలు

చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను సమర్థించే లేదా ప్రోత్సహించే కంటెంట్‌ను మేము అనుమతించము. వ్యవస్థీకృత నేరం, నేర కార్యకలాపాలు, ఆయుధాల ప్రచారం/విక్రయం/ఉపయోగం, తుపాకీలు మరియు పేలుడు పదార్థాలు, హింస లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కంటెంట్‌ను మేము నిషేధిస్తాము. చట్టవిరుద్ధమైన వస్తువులు లేదా సేవలు, నియంత్రిత వస్తువులు, మందులు మరియు నియంత్రిత పదార్థాల అమ్మకం మరియు లైంగిక సేవలను అభ్యర్థించడం లేదా విక్రయించడం ఖచ్చితంగా నిషేధించబడింది.

పిల్లలను వేధించే, హానికరమైన లేదా దుర్వినియోగం చేసే కంటెంట్‌ను మేము అనుమతించము. మనీలాండరింగ్ లేదా జూదానికి సంబంధించిన లేదా ప్రోత్సహించే కంటెంట్‌ను వినియోగదారులు పోస్ట్ చేయకూడదు.

నేర కార్యకలాపాలలో పాల్గొనడం, బాంబులు తయారు చేయడం లేదా ప్రోత్సహించడం లేదా డ్రగ్స్ వ్యాపారం చేయడం వంటి వాటితో సహా చట్టవిరుద్ధమైన మరియు నిషేధించబడిన కార్యకలాపాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం, ట్యుటోరియల్‌లు లేదా సూచనలను ప్రదర్శించే కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి వినియోగదారులు అనుమతించబడరు. భారత ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రకటించబడిన అటువంటి వస్తువులు మరియు సేవలకు సంబంధించిన ఏదైనా లావాదేవీ లేదా బహుమతిని అభ్యర్థించడానికి లేదా సులభతరం చేయడానికి మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించవద్దు

మరొక వ్యక్తి (మీ కుటుంబం, స్నేహితులు, సెలబ్రిటీలు, బ్రాండ్‌లు లేదా ఏదైనా ఇతర వ్యక్తులు/సంస్థలు వంటివి) వలె నటించడం మరియు వ్యక్తిగత లేదా ఆర్థిక లాభం పొందడం కోసం మా ప్లాట్‌ఫామ్‌లో తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని పోస్ట్ చేయడం మోసంగా పరిగణించబడుతుంది.

కంప్యూటర్ వైరస్‌లు, మాల్వేర్ లేదా ఏదైనా కంప్యూటర్ వనరు యొక్క కార్యాచరణను పరిమితం చేయడానికి రూపొందించబడిన ఏదైనా ఇతర కంప్యూటర్ కోడ్‌ను కలిగి ఉన్న కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేయబడదు.

j. ఏకాభిప్రాయం లేని (వ్యక్తిగత) కంటెంట్

పోస్ట్ చేయడానికి స్పష్టమైన అనుమతి ఇవ్వని ఇతర వ్యక్తుల చిత్రాలు లేదా వీడియోలతో సహా ఇతరుల వ్యక్తిగత కంటెంట్, డేటా సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా దుర్వినియోగం చేయడం అనుమతించబడదు. వారి అనుమతి లేకుండా ఎవరి వ్యక్తిగత లేదా సన్నిహిత ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయవద్దు. ఎవరి గోప్యతకు భంగం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దు. మేము అటువంటి కంటెంట్‌ను తొలగిస్తాము..

పరిమితి లేకుండా ఒకరి వ్యక్తిగత డేటా లేదా గోప్యమైన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం: సంప్రదింపు సమాచారం, చిరునామా, ఆర్థిక సమాచారం, ఆధార్ నంబర్, ఆరోగ్య సంరక్షణ సమాచారం, లైంగిక లేదా సన్నిహిత చిత్రాలు మరియు వీడియోలు, పాస్‌పోర్ట్ సమాచారం లేదా అలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయమని లేదా ఉపయోగించమని బెదిరించడం వంటివి వేధింపుగా పరిగణించబడతాయి, మరియు అలాంటి కార్యకలాపాలు ఖచ్చితంగా ఆమోదించబడదు.

k. స్పామ్

ఏదైనా మూలం గురించి వినియోగదారులను తప్పుదారి పట్టించే కంటెంట్, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేదా తప్పుదారి పట్టించే ప్రాతినిధ్యాలు మరియు భద్రతా ఉల్లంఘనలను ప్రదర్శించడం లేదా ప్రచారం చేయడం వంటివి స్పామ్ పరిధిలోకి వస్తాయి. అటువంటి కంటెంట్, వాణిజ్య లాభం కోసం పోస్ట్ చేసినప్పుడు, అది వాణిజ్య స్పామ్‌గా ఉంటుంది. స్పామ్ ప్లాట్‌ఫామ్ యొక్క పని సజావుగా చేయడంలో జోక్యం చేసుకుంటుంది మరియు ఇతర వినియోగదారులను షేర్ చేయకుండా నిరోధిస్తుంది. మీరు షేర్ చేసే కంటెంట్ ప్రామాణికమైనది మరియు వినియోగదారులు ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయడానికి సురక్షితమైన మరియు విశ్వసనీయ వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. స్పామ్, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా ప్రచారం చేయడానికి వీక్షకులను ఇబ్బంది పెట్టాలని లేదా వస్తువులు/సేవలను విక్రయించాలని భావించినట్లయితే, అదే కంటెంట్‌ను అనేకసార్లు పోస్ట్ చేయవద్దు. ట్రాఫిక్‌ని సృష్టించడానికి లేదా అనుచరులు, ఇష్టాలు, వీక్షణలు, వ్యాఖ్యలు మరియు షేర్‌లను పెంచడానికి కృత్రిమ మరియు మానిప్యులేటివ్ మార్గాలను ఉపయోగించవద్దు.

మీరు మీ వస్తువులు లేదా సేవలను ప్రచారం చేయాలనుకుంటే, దానిని ప్రామాణికమైన పద్ధతిలో చేయమని మేము మిమ్మల్ని కోరుతున్నాము.

l. తప్పుడు సమాచారం

మా ప్లాట్‌ఫామ్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా పోరాడాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. వినియోగదారులను లేదా సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం, బూటకాలను లేదా నకిలీ ప్రచారాన్ని వ్యాప్తి చేసే ఏ రకమైన కంటెంట్ అనుమతించబడదు. వాస్తవం కాని అంశాలను అందులో ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే ఉన్న వార్తలను అతిశయోక్తి చేసే కంటెంట్‌ను పోస్ట్ చేయడాన్ని మేము నిషేధిస్తాము. మేము ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులను తప్పుదారి పట్టించే లేదా కంటెంట్‌ను రూపొందించడానికి మార్గాన్ని సృష్టించడానికి ప్రయత్నించే, పరువు నష్టం కలిగించే, అపవాదు లేదా ఒకరి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను లేదా తప్పు సమాచారం ఆధారంగా వారి ఆర్థిక లేదా రాజకీయ స్థితిని దెబ్బతీసే కంటెంట్‌ను అనుమతించము.

అయినప్పటికీ, మేము నకిలీ వార్తలను ఎలాంటి వ్యంగ్యం లేదా పేరడీలతో గందరగోళం పెట్టము. మేము ప్లాట్‌ఫామ్‌లో అటువంటి కంటెంట్‌ను అనుమతించము, కంటెంట్ ఇతర వినియోగదారులను తప్పుదారి పట్టించదు మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదనే ఉద్దేశ్యం దీని వెనుక ఉంది.

కమ్యూనిటీ గైడ్​లైన్స్​

మీరు మా ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించినప్పుడు, మీరు కొన్ని నిబంధనలను పాటించాలని మేము సూచిస్తున్నాము.

a. సరిగ్గా ట్యాగ్ చేయండి

అన్ని పోస్ట్‌లు అత్యంత సముచితమైన ట్యాగ్‌తో ట్యాగ్ చేయబడాలి. అటువంటి ట్యాగ్ అందుబాటులో లేకుంటే, తదనుగుణంగా ఒక ట్యాగ్​ సృష్టించండి. అసంబద్ధమైన ట్యాగ్‌తో పోస్ట్ చేయబడిన ఏదైనా కంటెంట్ రిపోర్ట్ చేయబడితే ఫీడ్ నుండి తీసివేయబడుతుంది.

b. టాపిక్​ నుంచి మరల వద్దు

Takatak చాలా యాక్టివ్ ప్లాట్‌ఫామ్. మీరు పోస్ట్ చేసే ఏదైనా కంటెంట్ మరియు మీరు పాల్గొనే ఏదైనా చర్చ పోస్ట్ యొక్క క్యాప్షన్ మరియు ట్యాగ్‌లకు సంబంధించినదని నిర్ధారించుకోండి. క్యాప్షన్ లేదా ట్యాగ్‌లకు సంబంధం లేని లేదా నిర్దిష్ట పోస్ట్‌కు అసమంజసమైన కంటెంట్ తీసివేయబడుతుంది. టాపిక్​ నుండి మరల వద్దు.

c. అనేక/నకిలీ ప్రొఫైల్‌లు

ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించడం, వారిని వేధించే లేదా బెదిరించే ఉద్దేశంతో లేదా తప్పుదారి పట్టించే, మోసగించే రీతిలో వాడటం అనుమతించబడదు. మేము కమ్యూనిటీ ప్రొఫైల్‌లు, న్యూస్ ప్రొఫైల్‌లు మరియు ఫ్యాన్ ప్రొఫైల్‌లకు మినహాయింపులను అనుమతిస్తాము. ఇతర వినియోగదారులను తప్పుదారి పట్టించకూడదనే ఉద్దేశం ఉన్నంత వరకు మరియు ప్రొఫైల్ వివరణ లేదా ప్రొఫైల్ స్టేటస్‌లో స్పష్టంగా పేర్కొనబడినంత వరకు పబ్లిక్ వ్యక్తుల వ్యంగ్య లేదా పేరడీ ఖాతాలు కూడా అనుమతించబడతాయి.

d. సేఫ్టీ మరియు సెక్యూరిటీ

వేరొకరిని వేధించడం లేదా మరొక వినియోగదారుని ఉద్దేశించి పోస్ట్‌లు లేదా వ్యాఖ్యలలో దుర్భాషను ఉపయోగించడం అనుమతించబడదు. ఇతర వినియోగదారులకు అసౌకర్యంగా అనిపించే ఏదీ చేయవద్దు. మీరు ఇతర వినియోగదారులకు ప్రతికూల పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నిస్తే మీపై చర్య తీసుకోబడుతుంది.

e. చట్టపరమైన పరిణామాల పట్ల జాగ్రత్త వహించండి

మీ చర్యలకు బాధ్యత నుండి తప్పించుకోవడానికి చట్టం పట్ల అజ్ఞానం ఒక సాకు కాదు. మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడానికి, మీరు డిజిటల్ వాతావరణంలో ప్రవర్తనను నియంత్రించే చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దయచేసి మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వర్తించే అన్ని చట్టాలను గౌరవించండి. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఫీచర్ చేయడం, ప్రోత్సహించడం, అందించడం, ప్రచారం చేయడం, కీర్తించడం లేదా అభ్యర్థించడం వంటి ఏదైనా కంటెంట్ సహించబడదు.

f. సస్పెన్షన్ నుండి తప్పించుకోవడం

ఏదైనా ఖాతాను సస్పెండ్ చేయాలనే మా నిర్ణయం వినియోగదారుపై కట్టుబడి ఉంటుంది. ఇతర ఖాతాలు, గుర్తింపులు, వ్యక్తిత్వాలు లేదా మరొక వినియోగదారు ఖాతాలో ఉనికిని సృష్టించడం ద్వారా సస్పెన్షన్‌ను తప్పించుకోవడానికి చేసే ఏదైనా ప్రయత్నం కూడా సస్పెన్షన్‌కు దారి తీస్తుంది. మీరు సస్పెన్షన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, మేము మా ప్లాట్​ఫామ్​లో మీ ఖాతాను తొలగించాల్సి వస్తుంది మరోసారి ఖాతాను క్రియేట్​ చేసుకోకుండా మిమ్మల్ని బ్లాక్ చేయవచ్చు.

ప్లాట్‌ఫామ్ సెక్యూరిటీ

కాపీరైట్ దావాలు

ఏదైనా కంటెంట్ లేదా యాక్టివిటీ మా ప్లాట్‌ఫామ్‌కు అనుచితంగా ఉన్నట్లు మేము గుర్తిస్తే, మేము దానిని తొలగిస్తాము. ప్లాట్‌ఫామ్‌లోని ఏదైనా కంటెంట్ కాపీరైట్ హోల్డర్‌గా మీ హక్కులను ఉల్లంఘిస్తుందని మీరు విశ్వసిస్తే, మీరు takatakgrievance@sharechat.co కి ఇ-మెయిల్ పంపడం ద్వారా కాపీరైట్ దావాను సమర్పించవచ్చు తదుపరి మీ రిపోర్ట్ ను సమీక్షించి చర్య తీసుకోబడుతుంది. ప్లాట్‌ఫామ్‌లో మీకు నచ్చని కంటెంట్ ఉండవచ్చు కానీ అదే ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించకూడదు. అలాంటప్పుడు, అటువంటి వినియోగదారులను ఫాలో చేయటం ఆపేయటం లేదా బ్లాక్ చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.

కంటెంట్ స్టేటస్ మరియు కంటెంట్ యొక్క సమీక్ష

మేము చట్టాలను పాటించే మధ్యవర్తులం మాత్రమే. ప్లాట్‌ఫామ్‌లో మా వినియోగదారులు ఏమి పోస్ట్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మేము నియంత్రించము మరియు వారి (లేదా మీ) చర్యలకు (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో) బాధ్యత వహించము. మీరు మా సేవల ద్వారా వాటిని యాక్సెస్ చేసినప్పటికీ, ఇతరులు అందించే సేవలు మరియు ఫీచర్‌లకు మేము బాధ్యత వహించము. మా ప్లాట్‌ఫామ్‌లో జరిగే దేనికైనా మా బాధ్యత మరియు భారతదేశ చట్టాల ద్వారా ఖచ్చితంగా నిర్వహించబడుతుంది మరియు పరిమితం చేయబడింది.

మీరు పోస్ట్ చేసిన దానికి మరియు మీరు చూసే వాటికి మీరే బాధ్యత వహించాలని మేము ఆశిస్తున్నాము. మా వినియోగదారులలో ఎవరైనా మీ కంటెంట్ ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు రిపోర్ట్ చేస్తే, మేము అవసరమైన విధంగా చర్యలు తీసుకోవచ్చు.

గ్రీవెన్స్ అధికారి

డేటా సేఫ్టీ, ప్రైవసీ మరియు ఇతర ప్లాట్‌ఫామ్ వినియోగ సమస్యలకు సంబంధించి మీ సమస్యలను పరిష్కరించడానికి Takatak ఒక గ్రీవెన్స్ అధికారిని కలిగి ఉంది.

మీరు ఈ క్రింది వాటిలో దేనిలోనైనా ఫిర్యాదుల అధికారిని Ms హర్లీన్ సేథిని సంప్రదించవచ్చు:

Address: No.2 26, 27 1st Floor, Sona Towers, Hosur Rd, Industrial Area, Krishna Nagar, Bengaluru, Karnataka 560029. Monday to Friday.
Email: takatakgrievance@sharechat.co
గమనిక: దయచేసి పైన పేర్కొన్న ఇ-మెయిల్ IDకి అన్ని వినియోగదారు సంబంధిత ఫిర్యాదులను పంపండి, మేము వాటిని త్వరగా ప్రాసెస్ చేయడానికి మరియు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం.

నోడల్ కాంటాక్ట్ పర్సన్ - MS హర్లీన్ సేథి
Email: nodalofficer@sharechat.co
గమనిక - ఈ ఇ-మెయిల్ పూర్తిగా పోలీసులు మరియు దర్యాప్తు సంస్థల ఉపయోగం కోసం మాత్రమే. వినియోగదారు సంబంధిత సమస్యల కోసం ఇది సరైన ఇ-మెయిల్ ID కాదు. అన్ని వినియోగదారు సంబంధిత ఫిర్యాదుల కోసం, దయచేసి takatakgrievance@sharechat.co ద్వారా సంప్రదించండి.

సవాలు చేసే హక్కు

మీ కంటెంట్ అన్యాయంగా తీసివేయబడిందని మీకు అనిపిస్తే, రిపోర్ట్ చేయటానికి మీరు takatakgrievance@sharechat.co ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.. మేము కంటెంట్‌ని మళ్లీ సమీక్షించవచ్చు మరియు ప్లాట్‌ఫామ్‌లో మళ్లీ పోస్ట్ చేయవచ్చో లేదో నిర్ణయించవచ్చు.

ఉల్లంఘించేవారిపై మా చర్యలు

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే వారిపై మేము కఠిన మరియు సత్వర చర్య తీసుకుంటాము. మీ ప్రొఫైల్ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు రిపోర్ట్ చేయబడితే మీ ప్రొఫైల్ తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు. ఈ మార్గదర్శకాలను పదే పదే ఉల్లంఘిస్తే మీ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేయవలసి వస్తుంది. మరియు మరోసారి రిజిస్టర్ చేసుకోకుండా మిమ్మల్ని బ్లాక్ చేయవచ్చు. అవసరమైతే, మేము చట్టపరమైన అధికారులు మరియు చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాలతో సహకరిస్తాము. ఈ విషయంలో మీకు సహాయం చేయవలసిన బాధ్యత మాకు లేదని దయచేసి గమనించండి.